News July 5, 2024

త్వరలో కొత్త రేషన్‌కార్డులు

image

TG: ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వాటినే మిల్లింగ్ చేయించి రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. బియ్యాన్ని వినియోగదారులే తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోతుందని CM అభిప్రాయపడ్డారు.

Similar News

News December 11, 2025

ఈ ఉదయం 7 గంటల నుంచి..

image

TG: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి మ.1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2PM నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. తొలి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది.. 27,628 వార్డులకు 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ విడతలో 5 గ్రామాలకు, 169 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి.

News December 11, 2025

గురువారం బృహస్పతిని పూజిస్తే..

image

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.

News December 11, 2025

నిద్ర తక్కువైతే!

image

నిద్ర తక్కువైతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, బీపీ, మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కొన్ని రోజులు సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపించడం, నిరాశ, కుంగుబాటు వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుష్షునూ తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. మంచి నిద్ర కోసం ధ్యానం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్రమమైన నిద్ర సమయాలు పాటించాలని సూచిస్తున్నారు.