News April 3, 2024

వచ్చే నాలుగు రోజులు మంటలే..

image

AP: రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న 4 రోజులు పలు చోట్ల ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు, అక్కడక్కడ 4- 5 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశముందని చెప్పింది. ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News February 18, 2026

నరసాపురం: పెళ్లైన విషయం దాచి బాలికతో ప్రేమ.. చివరికి..!

image

నరసాపురం రుస్తుంబాదకు చెందిన వివాహితుడు కొవ్వెల కళ్యాణ్, తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఓ బాలికను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు తరలించినట్లు DSP డా.శ్రీవేద తెలిపారు. నరసాపురం టౌన్ SI సీహెచ్ జయలక్ష్మి కేసు నమోదు చేశారు.

News February 18, 2026

ఆత్మ గౌరవం కోసం మార్గదర్శకాలు

image

– నీ మాటలకు విలువ లేని చోట మౌనంగా ఉండటమే శ్రేయస్కరం.
– నిన్ను గౌరవించని ప్రదేశంలో ఒక్క క్షణం కూడా నిలబడకూడదు.
– ప్రేమ లేని చోట దాని కోసం ఆశ పడటం వ్యర్థం.
– నీకు నచ్చని, నువ్వు తప్పు చేయని విషయాలకు అనవసరంగా క్షమాపణలు చెప్పకు.
– నీకు నచ్చని పనుల గురించి ఇతరులకు వివరణలు ఇస్తూ కూర్చోకు.

News February 18, 2026

నెలకు రూ.82,720 జీతంతో ఉద్యోగాలు

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(<>CSL<<>>)లో 64 ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ICAI, MBA(HR), పీజీ(సోషల్ వర్క్)ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు(రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ. 82,720 చెల్లిస్తారు. సైట్: cochinshipyard.in