News December 2, 2025
NGKL: అధికార పార్టీకి ‘రెబల్స్’ టెన్షన్..!

NGKL జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ (కాంగ్రెస్) అభ్యర్థులకు రెబల్స్ బెడద పట్టుకుంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో పార్టీకి చెందిన నాయకులే రెబల్‌గా నామినేషన్లు వేయడంతో వారిని ఉపసంహరించుకునేలా చేయడానికి నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతి గ్రామంలో ఇద్దరు పోటీ చేస్తుండడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు రేపు చివరి రోజు గడువు ఉంది.
Similar News
News February 15, 2026
రేపు పాక్‌పై అభిషేక్ సునామీ!

T20WC: భారత కెప్టెన్ <<19142443>>సూర్య<<>> మాటలతో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ రేపు పాక్‌పై ఆడటం ఖాయమైంది. అటు గంభీర్ పర్యవేక్షణలో ఇవాళ అతను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సైతం బయటికొచ్చాయి. ఇప్పటి వరకు అభిషేక్ పాక్‌పై ఆడిన 3 మ్యాచుల్లోనూ అదరగొట్టారు. 190 స్ట్రైక్‌రేట్‌తో 110 రన్స్ చేశారు. రేపటి మ్యాచులోనూ చెలరేగి భారత్‌కు శుభారంభం అందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అటు అభిషేక్ ఆడనున్న నేపథ్యంలో సంజూపై వేటు పడనుంది.
News February 15, 2026
ఐదుగురి ప్రాణదాతకు అరుదైన గౌరవం

కేరళలో యంగెస్ట్ ఆర్గాన్ డోనర్ అలిన్ షెరిన్(10 నెలలు)కు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ తర్వాత అవయవదానంతో ఐదుగురికి <<19136911>>ప్రాణం పోసిన<<>> ఆ పసికందుకు పోలీస్ లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం విజయన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ బాలిక భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచుతారు. బగల్ సెల్యూట్(ఒక రకమైన వాయిద్య పరికరం)తో సహా పోలీసు గౌరవంతో అంతిమ యాత్ర నిర్వహిస్తారు.
News February 15, 2026
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఆదివారం వారాంతపు సెలవుతో పాటు, సోమవారం (16-02-2026) మహాశివరాత్రి, మంగళవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ లావాదేవీలు నిలిపివేయనున్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, క్రయవిక్రయాల కోసం బుధవారం మార్కెట్‌కు రావాలని అధికారులు కోరారు.


