News March 16, 2025
NGKL: అయ్యో పాపం.. చిన్నారి మృతి

బల్మూరు మండలం చిన్నారి సంపులో పడి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొండనాగులకి చెందిన చింత మహేశ్, సుస్మిత దంపతులకు చిన్నారి నాన్సీ(2) ఉంది. ఆడుకుంటూ పక్కింటికి వెళ్లింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవటంతో ఇంటి ఎదుట ఉన్న సంపులో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందింది.
Similar News
News February 13, 2026
‘లోకల్’ ఫలితాలపై ‘గులాబీ’లో అంతర్మథనం

TG: మున్సి‘పోల్స్’ పై BRSలో అంతర్మథనం మొదలైంది. KTR, హరీశ్ మినహా పార్టీ MLAలు, నేతలు పోరాడిన స్థానాల్లో ఫలితం దక్కలేదు. గజ్వేల్, సిరిసిల్ల, దుబ్బాకలో గెలవగా మిగతా చోట్ల హంగ్, లేదా 2వ స్థానంలో నిలిచింది. జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట సహా ఉమ్మడి నల్గొండలో విఫలమైంది. దయాకర్ రావు జిల్లా WGLలోనూ అంతే. హుజూరాబాద్, జమ్మికుంటలో కౌశిక్ దెబ్బతిన్నారు. HYD శివారులో పట్టు నిలుపుకొంది.
News February 13, 2026
గద్వాల మున్సిపల్ పీఠం కోసం హోరాహోరీ… పొత్తులపై ఉత్కంఠ

గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ 16,బీఆర్ఎస్ 11,బీజేపీ7 స్థానాలు సాధించాయి. ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ ఇండిపెండెంట్ల మద్దతుపై ఆశలు పెట్టుకోగా, BRS–BJP అభ్యర్థిపై చర్చలు జరుగుతున్నాయి. ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరితే ఛైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 16న జరగనున్న ఛైర్మన్ ఎన్నికతో తెర పడనుంది.
News February 13, 2026
జనగామలో ఛైర్మన్ పీఠానికి స్వతంత్రులే కీలకమా..!

జనగామ పురపాలక సంఘం ఛైర్మన్ పీఠానికి స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు. మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. కాంగ్రెస్-12 సీట్లు, బీఆర్ఎస్-13 సీట్లు, సీపీఐ-1 సీటు, స్వతంత్ర అభ్యర్థులు-4 సీట్లు వచ్చాయి. సీపీఐ, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు.


