News September 10, 2025

NGKL: ఈ చెట్టును చూసి నేర్చుకుందాం బ్రదర్!

image

పరీక్ష ఫెయిల్ అయితే జీవితమేం ఆగం కాదు. ఉద్యోగం రాకపోతే భవిష్యత్తు మాయమవదు. ప్రేమ విఫలమైతే ప్రపంచం ఖాళీ కాదు. అయినా మనుషులు చనిపోవాలని భావిస్తున్నారు. కానీ, అచ్చంపేటలోని ఓ చెట్టు ఎండలతో మోడుబారి.. చనిపోయేస్థితి నుంచి మళ్లీ చిగురించి నలుగురికి నీడనిస్తోంది. అలా మన జీవితానికి పునర్జన్మ అంటూ ఉంటుందని, బాధలపై గెలిచి బతికి చూపించాలని పలువురు చెబుతున్నారు.
# నేడు ఆత్మహత్య నివారణ దినోత్సవం

Similar News

News December 8, 2025

ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

image

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్‌లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి.

News December 8, 2025

నంద్యాల జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారులు

image

డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ వేసి, వేయించి పోలియోను శాశ్వతంగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,38,404 మంది పిల్లలు ఉన్నారని, 1318 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామని, 5,272 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.

News December 8, 2025

ఏలూరు: PGRSకు 363 ఫిర్యాదులు- JC

image

ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి PGRS కార్యక్రమంలో మొత్తం 363 ఫిర్యాదులు స్వీకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ సోమవారం తెలిపారు. ఆయా శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి, నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని JC సూచించారు.