News May 7, 2025

NGKL: ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించిన మంత్రి సీతక్క

image

కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం మంత్రి సీతక్క వంశీకృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పూర్తిగా తగ్గేవరకు డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించి విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 7, 2026

దివ్యాంగులకు వెసులుబాటు కల్పించిన UPSC

image

సివిల్స్ ఎగ్జామ్స్ రాసే దివ్యాంగుల(Pwbd)కు పరీక్షా కేంద్రం ఎంపికలో <<19061199>>UPSC<<>> వెసులుబాటు కల్పించింది. అభ్యర్థులు కోరుకున్న కేంద్రాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. గరిష్ఠ సామర్థ్యం(ఫుల్ స్ట్రెంత్) చేరుకున్నప్పటికీ దివ్యాంగ అభ్యర్థులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనుంది. అవసరమైన చోట పరీక్షా కేంద్రం సామర్థ్యాన్ని పెంచుతామని UPSC తెలిపింది. అయితే ఇది ఇతరులకు వర్తించదని స్పష్టం చేసింది.

News February 7, 2026

HYD: మహిళా ఇంజినీర్లకు బంపర్ ఆఫర్

image

HYD ఐఐఐటీలోని ఐహబ్‌-డేటా మహిళా గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. (AI), మెషీన్‌ లెర్నింగ్‌ (ML) అంశాలపై 6 నెలల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఈ కోర్సులో ప్రతి సోమవారం క్యాంపస్‌లో తరగతులు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన వారికి మూడు నెలల ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 20లోగా https://ihub-data.ai వెబ్‌సైట్‌‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 7, 2026

VZM: మార్చి 31లోగా ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలి

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కృష్ణ తేజ ఆదేశించారు. శుక్రవారం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఉపాధి హామీ పనులపై కమీషనర్ సమీక్షించారు. తక్కువ పురోగతి ఉన్న గంట్యాడ, వేపాడ, గరివిడి, గజపతినగరం, జామి మండలాలు మార్చి 15లోగా పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.