News February 6, 2025

NGKL: కడుపునొప్పి భరించలేక.. వ్యక్తి బలవన్మరణం

image

తీవ్రమైన కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన గంగనమోని భాగయ్య(58) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నొప్పి భరించలేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.

Similar News

News January 18, 2026

VJA: గులకరాయి నిందితుడి ప్రేమాయణం..!

image

వైసీపీ అధినేత జగన్‌పై గతంలో గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు వేమూరి సతీశ్ కుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయవాడ సింగ్‌ నగర్‌కు చెందిన ఇతను ఓ మైనర్ బాలికను ప్రేమించి, పెళ్లి చేయాలంటూ శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బాలిక వయసు రీత్యా మైనర్ కావడంతో పోలీసులు సతీశ్‌‌పై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో అతడిని జైలుకు తరలించారు.

News January 18, 2026

ఆదివారం.. అమావాస్య.. మేడారం!

image

అసలే చొల్లంగి అమావాస్య ఆదివారం కావడం, రాష్ట్ర సర్కార్ క్యాబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించడం వెనుక మతలబేంటి అని చర్చ జరుగుతోంది. ఈరోజు తనపై ఎవరైనా నరదృష్టి చేసినా, తమపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పొగొట్టుకొవడానికి నాలుగు బాటల దగ్గర నిమ్మకాయ, గుడ్డును దాటుడు కోసం వేస్తారు. ఇలాంటి రోజు అడవిలో మంత్రుల సమావేశం నిర్వహించడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

News January 18, 2026

గిరిజన సంస్కృతికి నిలువుటద్దం ‘నాగోబా జాతర’

image

ADB(D) కేస్లాపూర్(V)లో గిరిజనులు నాగోబా జాతరను అత్యంత భక్తితో జరుపుకొంటారు. పుష్యమాస అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవం నాగోబా నాట్యం చేస్తాడని మెస్రం వంశీయుల నమ్మకం. ఈ పండుగ కోసం గిరిజనులు 100km నడిచి గోదావరి జలాన్ని కలశాల్లో తెస్తారు. అమావాస్య అర్థరాత్రి ఆ పవిత్ర జలంతో స్వామికి అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది తరలివస్తారు.