News February 6, 2025
NGKL: కడుపునొప్పి భరించలేక.. వ్యక్తి బలవన్మరణం

తీవ్రమైన కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన గంగనమోని భాగయ్య(58) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నొప్పి భరించలేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.
Similar News
News February 14, 2026
HYD: ఇద్దరికి సున్నా.. వారి ఓటెవరికి వేసినట్లు?

RR మున్సిపల్ ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు. చేవెళ్ల 5th వార్డులో TRP అభ్యర్థి రాజుకు ఒక్క ఓటూ పడలేదు. తన ఓటు తానూ వేసుకోకపోవడం గమనార్హం. 1st వార్డులో BJP అభ్యర్థి శ్రీనివాస్‌కు 2ఓట్లు రాగా 4వవార్డు BJP అభ్యర్థి కేశపల్లి భాగ్యమ్మకు 2ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో 2nd వార్డ్‌లో అలీకి ఓట్లురాలేదు. 19thవార్డులో BSP అభ్యర్థి రఘుపతికి 1ఓటు పడింది. శంకర్‌పల్లిలో 13వవార్డు జనసేన అభ్యర్థి సాయికి 2ఓట్లు పడ్డాయి.
News February 14, 2026
AP బడ్జెట్: అమరావతి అభివృద్ధికి ఎన్ని నిధులంటే?

రాష్ట్ర 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,32,205 కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపుదిద్దుకుంది. అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ కీలక కేటాయింపులు చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.6,000 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది బలమైన అడుగుగా ప్రభుత్వం పేర్కొంది.
News February 14, 2026
తొందరపాటు నిర్ణయంతో 90% మంది ఫెయిల్: మంత్రి

AP: 2019-24 మధ్య సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టిన సంస్కరణలతో విద్యా వ్యవస్థ వెనుకబాటుకు గురైందని మంత్రి కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘తొందరపాటు నిర్ణయంతో 1,000 స్కూళ్లను CBSE విధానానికి మార్చడం వల్ల 90% మంది విద్యార్థులు పాస్ కాలేకపోయారు. టీచర్ల సన్నద్ధత లేకపోవడంతో “టోఫెల్” ఫెయిలైంది. పరిపాలనా వైఫల్యంతో “నాడు-నేడు”లో ₹7,875Cr మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలాయి’ అని వివరించారు.


