News September 13, 2025
NGKL: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఈగలపెంట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సల్వాది బాలయ్య గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వ్యక్తి. అచ్చంపేట, సిద్దాపూర్, ఆమనగల్, మహబూబ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య మృతి పట్ల తోటి పోలీసు సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Similar News
News December 8, 2025
MDK: నాడు భర్త సర్పంచ్.. నేడు భార్య ఏకగ్రీవ సర్పంచ్

టేక్మాల్ మండలం చల్లపల్లిలో ఎల్లంపల్లి సంగీతను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామానికి చెందిన ఎల్లంపల్లి గోపాల్ 2018 సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి 11 ఓట్లతో గెలిచాడు. 5 ఏళ్లు గోపాల్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తించిన గ్రామ ప్రజలు అతని భార్య ఎల్లంపల్లి సంగీతను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలలో నామినేషన్ వేయించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News December 8, 2025
ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(SCR) నేటి నుంచి 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి – యెలహంక, యెలహంక – చర్లపల్లి, చర్లపల్లి – షాలిమార్, షాలిమార్ – చర్లపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. అలాగే HYD – కొట్టాయం, కొట్టాయం – HYD, చర్లపల్లి – H.నిజాముద్దీన్, H.నిజాముద్దీన్ – చర్లపల్లి మధ్య రైళ్లు నడుస్తాయని SCR తెలిపింది. రైళ్ల స్టాపులు తదితర వివరాలను పై ఫొటోల్లో చూడొచ్చు.
News December 8, 2025
పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

2026 మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు చెల్లించే ఫీజు తేదీల గడువును పెంచినట్లు DEO క్రిష్టప్ప
ఆదివారం తెలిపారు. అన్ని పాఠశాలల యాజమాన్యం గమనించాలని కోరారు. ఎలాంటి అపరాద రుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125లు, ఒకేషనల్ విద్యార్థులు ఫీజుతో పాటు అదనంగా రూ.60లు, తక్కువ వయస్సు కోసం రూ.300లు చెల్లించాన్నారు.


