News November 20, 2025

NGKL: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా సవరణ, తుది ప్రచురణపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలు, సాంకేతిక ఏర్పాట్లపై సమీక్షించారు.

Similar News

News January 14, 2026

NRPT: సంక్రాంతి పండగ పూట విషాదం..

image

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నేతాజీ (36) దుర్మరణం చెందారు. మక్తల్ నుంచి రాయచూర్ వెళ్తున్న లారీ, అదే మార్గంలో వెళ్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నేతాజీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్సై నవీద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పండుగ పూట ఈ ప్రమాదం విషాదం నింపింది.

News January 14, 2026

KNR: సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత

image

కరీంనగర్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శాపంగా మారింది. రెగ్యులర్ అధికారులు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. తిమ్మాపూర్ వంటి చోట్ల 3 నెలల్లోనే నలుగురు అధికారులు మారడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, తగిన అవగాహన లేక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని క్రయవిక్రయదారులు వాపోతున్నారు.

News January 14, 2026

క్యాబినెట్ అజెండాలోకి ‘నల్లమలసాగర్’

image

TG: నల్లమలసాగర్ ప్రాజెక్టుపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18న మేడారంలో జరిగే క్యాబినెట్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. నల్లమలసాగర్‌పై APని కట్టడిచేసేలా న్యాయపరమైన అంశాలన్నిటినీ దీనిలో చర్చించనుంది. ఇటీవల వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని SC చెప్పడంతో TG ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సివిల్ దావాను పగడ్బందీగా దాఖలు చేసేందుకు నిర్ణయించింది.