News November 17, 2025
NGKL: జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత

తెలంగాణ పత్తి మిల్స్ అసోసియేషన్ సమ్మె కారణంగా రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల నిబంధనను తొలగించి, 7 క్వింటాళ్ల కొనుగోలు నిబంధన విధించడంతో పాటు మిల్లులకు గ్రేడ్స్ కేటాయించడంపై వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగానే ఈ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 18, 2026
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

అత్యధిక వేదికల్లో సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పారు. 35 వేదికల్లో శతకాలు నమోదు చేసి సచిన్(34) రికార్డును బ్రేక్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(26), పాంటింగ్(21) ఉన్నారు. మరోవైపు NZపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ రికార్డులకెక్కారు. కోహ్లీ(10) తర్వాతి స్థానాల్లో కలిస్(9), రూట్(9), సచిన్(9), పాంటింగ్(8), సెహ్వాగ్(8) ఉన్నారు.
News January 18, 2026
విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ: ఎస్‌ఈ రాజేశ్వరి

2026-27 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్‌పై ఈ నెల 20 నుంచి 27 వరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు APEPDCL ఎస్‌ఈ రాజేశ్వరి ఆదివారం తెలిపారు. డిస్కంలు సమర్పించిన చార్జీల ప్రతిపాదనలపై ప్రజలు తమ అభిప్రాయాలను అమలాపురం ఎస్‌ఈ కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 18, 2026
వనపర్తి: పుర ఎన్నికల ఆశావహుల్లో నైరాశ్యం

పుర ఎన్నికల రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల ఆశలు అడియాసలయ్యాయి. గత రిజర్వేషన్లు తారుమారు కావడంతో పతులు తమ సతుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నేతలు తమ సతీమణులను పోటీకి దించేందుకు సిద్ధపడగా, మరికొందరు అనుచరులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.


