News May 7, 2025

NGKL: జిల్లా కేంద్రంలో పోలీసుల విస్తృత తనిఖీలు

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాలతో బస్టాండ్‌లో ఉన్న వాహనాల పార్కింగ్ తదితర చోట్ల నార్కోటిక్, డ్రగ్స్ మీద సాధారణ చెకింగ్‌లో భాగంగా డాగ్ స్క్వాడ్ చేత తనిఖీలు చేపట్టారు. అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేపట్టినట్లు జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ భరత్ తెలిపారు.

Similar News

News February 17, 2026

కడప: ఇవాళ సూర్యగ్రహణం.. అర్చకులు ఏమన్నారంటే?

image

ఇవాళ అమావాస్య సందర్భంగా సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని, అందువల్ల ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు లక్ష్మీ సత్యనారాయణ స్వామి, ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ బట్టర్ తెలిపారు. గర్భిణులను గ్రహణం పేరుతో ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. యూట్యూబ్‌లో వస్తున్న గ్రహణ వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News February 17, 2026

‘ఫర్టిగేషన్’లో ఎలాంటి ఎరువులను అందించే అవకాశం ఉంటుంది?

image

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.

News February 17, 2026

418 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>బ్యాంక్ <<>>ఆఫ్ బరోడాలో 418 IT పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech, MTech/ME, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 22- 37ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు రూ.850, SC, ST, PwBDలకు రూ.175. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in