News October 6, 2024

NGKL: జీతాలు చెల్లించండి రేవంత్ సారూ..!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ జీతాలు చెల్లించాలని సీఎం రేంవత్ రెడ్డిని వేడుకుంటున్నారు. రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. జీతాలు రాక ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. ఇక బతుకమ్మ పండుగ ఎలా చేసుకోవాలని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దసరా పండుగ సమీపిస్తుంన్నందున ప్రభుత్వం స్పందించి తమ జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

Similar News

News December 16, 2025

ఉమ్మడి జిల్లాలో ఈనాటి ముఖ్యంశాలు

image

✔ఓటు హక్కును వినియోగించుకోండి:ఎస్పీలు
✔ఫేస్-3 సర్పంచ్ ఎన్నికలు..సర్వం సిద్ధం:కలెక్టర్లు
✔T-20 క్రికెట్ లీగ్.. గద్వాల్ జట్టు ఎంపిక
✔సర్పంచ్ ఎన్నికలు భారీ బందోబస్తు:ఎస్పీలు
✔సౌత్ జోన్.. ఈనెల 19న టేబుల్ టెన్నిస్ ఎంపికలు
✔సౌత్ జోన్.. ఈనెల 20న షటిల్,బ్యాడ్మింటన్ ఎంపికలు
✔మక్తల్:సర్పంచ్ ఎన్నికలు.. క్షుద్ర పూజల కలకలం
✔రేపు మహబూబ్ నగర్‌లో క్రికెట్ జట్టు ఎంపికలు

News December 16, 2025

MBNR: ఓటు హక్కును వినియోగించుకోండి- ఎస్పీ

image

ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పికెటింగ్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామన్నారు.

News December 16, 2025

MBNR: ఫేస్-3..సిబ్బందికి ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా బుధవారం జరగనున్న గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జడ్చర్ల మండల కేంద్రంలో BRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు.