News September 10, 2025

NGKL: నూతన మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా అనిత రెడ్డి ఎన్నిక

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సంఘం నూతన అధ్యక్షురాలిగా బి. అనిత రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా వి. రమణా రావు నియమితులయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ ఉబెదుల్లా కొత్వాల్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంజీవ్ ముదిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత రెడ్డి పారదర్శక పాలన, మార్కెట్ సౌకర్యాల విస్తరణ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News December 7, 2025

వైట్ హెడ్స్‌ని ఇలా వదిలిద్దాం..

image

శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్లో వైట్ హెడ్స్ ఒకటి. వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..* వేపాకులు, పసుపు పేస్ట్ చేసి దాన్ని వైట్ హెడ్స్‌పై రాసి పావుగంట తర్వాత కడిగేస్తే చాలు. * సెనగపిండి, పెసర పిండి, పాలు, కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి 20నిమిషాల పాటు ముఖానికి ఉంచి కడిగేయాలి. * వంటసోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్‌పై రాయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో కడిగేయాలి.

News December 7, 2025

రేపు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

image

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువకు, దిగువకు సోమవారం ఉదయం యాసంగి సాగుకు నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అధిక ప్రవాహం వల్ల కాలువలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాల సూచించారు. వివిధ గ్రామాల ప్రజలను అప్రమత్తం ఉండే విధంగా గ్రామస్థాయి అధికారులకు సూచించారు.

News December 7, 2025

6వేల మందితో మూడంచెల భద్రత: సీపీ సుధీర్ బాబు

image

TG: గ్లోబల్ సమ్మిట్‌కు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ‘6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 2 రోజుల తర్వాత పబ్లిక్‌కు అనుమతి ఉంటుంది. డెలిగేట్స్‌కు పైలట్ వాహనాలను ఏర్పాటు చేశాం. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.