News March 15, 2025

NGKL: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ ఓపెన్.

Similar News

News February 16, 2026

విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం

image

విశాఖలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్ సంఖ బ్రత బాగ్జీ, నౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు.

News February 16, 2026

హోరాహోరీ పోరులో పాలమూరు విజయం

image

జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-17 టోర్నీ ఫైనల్‌లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జ‌ట్టు 15 ఓవ‌ర్ల‌లో 110/5 ప‌రుగులు చేసింది. రామ్ చారి 31, కేతాన్ 30 ప‌రుగులు చేశారు. నాయక్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఖ‌మ్మం జ‌ట్టు 107/5 ప‌రుగులు చేసింది. 4 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. మాన్విత్ 30, సులేమాన్ 29 ప‌రుగులు చేశారు. ముఖ్య అతిథిగా ఏఎంఓ శ్రీనివాసులు, మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ జ్యోతి హాజరయ్యారు.

News February 16, 2026

బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్

image

గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.
• అమరావతి రాజధాని ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్టు, అత్యాధునిక పద్దతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్న బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను మెచ్చుకున్నారు.
• రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా.. ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు గేట్స్‌కు సీఎం వివరించారు.