News December 1, 2025
NGKL: పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం పూజలు

జిల్లా పర్యటనలో భాగంగా మక్తల్ పట్టణంలోని పడమటి అంజనేయ స్వామి దేవాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం పేరిట ప్రత్యేకంగా అర్చన చేసి ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు జూపల్లి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News February 17, 2026
KMR: పురం.. సమస్యల వలయం

కామారెడ్డి జిల్లాలో నూతన మున్సిపల్ కౌన్సిల్‌లు కొలువుదీరాయి. నూతన కౌన్సిలర్లకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఛైర్మన్/ఛైర్‌పర్సన్స్, కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారాలు చూపాలి. చెత్త నిర్వహణ సరిగ్గా లేక ఆయా మున్సిపాలిటీలు పేరుకుపోయాయి. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకురావాలి. నగర సుందరీకరణకు పాటుపడాలి. ఎల్లారెడ్డి, బిచ్కుందలో నూతన భవన నిర్మాణాలు చేపట్టాలి.
News February 17, 2026
మొగళ్లమూరు: ఆస్తి రాసిస్తే అనాథను చేసింది

మొగళ్లమూరుకు చెందిన వాసర్ల లక్ష్మి సోమవారం కలెక్టరేట్‌లో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆస్తి రాసిచ్చిన తర్వాత పెంపుడు కుమార్తె తనను నిర్లక్ష్యం చేస్తూ, మానసిక వేధింపులకు గురిచేస్తోందని కలెక్టర్‌కు విన్నవించారు. భర్త మృతితో ఒంటరినైన తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలో కుమార్తె పేరిట చేసిన రెండున్నర ఎకరాల దానసెటిల్‌మెంట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ఆస్తిని తిరిగి ఇప్పించాలని ఆమె వేడుకున్నారు.
News February 17, 2026
కర్తరీ దోషం అంటే ఏమిటి?

సూర్యుడు కృత్తికా నక్షత్రంలో సంచరించే కాలాన్ని ‘కర్తరీ దోషం’ అంటారు. దీన్నే ‘అగ్ని నక్షత్రం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది ప్రతి ఏటా మే నెలలో వస్తుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నేరుగా పడతాయి. దీనివల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ కాలాన్ని ప్రకృతి పరంగా కష్టకాలంగా భావిస్తారు. అందుకే ఈ 15-20 రోజుల పాటు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు.


