News December 1, 2025
NGKL: పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి ఎన్నికల పోరులో నాయకులు

NGKL జిల్లాలో జరుగుతున్న GP ఎన్నికలలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి పని చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో బిజెపి, BRS పార్టీల నాయకులు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలిసి పోటీ చేస్తున్నారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారనే విమర్శలు ఉన్నాయి.
Similar News
News February 18, 2026
18 నుంచి కొడవటంచలో విగ్రహ పునః ప్రతిష్ఠ

కొడవటంచలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి 21 వరకు విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న చిన్నజీయర్ స్వామి వారితో పాటు స్పీకర్, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం ఈ నెల 26 నుంచి మార్చి 5 వరకు జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.
News February 18, 2026
HYDలో మళ్లీ 2BHK ఇండ్లు

HYD జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, రెండు పడకల గదుల ఇండ్లపై సమీక్షించారు. స్థలాలు సేకరించి G+5-10 ఇందిరమ్మ ఇళ్లు కట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 2BHK ఇళ్ల పనులు కూడా పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.
News February 18, 2026
భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: ASF కలెక్టర్

బుధవారం ASF కలెక్టరేట్‌లో భూ సమస్యలపై కలెక్టర్ హరిత సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను తహశీల్దార్ ఫైళ్లతో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. తిరస్కరణల కారణాలు నమోదు చేయడం, ప్రజావాణి సమస్యల పరిష్కారం, కారుణ్య నియామకాల కింద వచ్చిన దరఖాస్తుల నివేదికలను సమర్పించడాన్ని పర్యవేక్షించాలని వివరించారు.


