News February 17, 2025

NGKL: పోలీస్ ప్రజావాణికి 12 ఫిర్యాదులు

image

ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని ఫిర్యాదారులకు సూచించారు.

Similar News

News March 16, 2026

కడప జిల్లాలో 16 మంది ఎమ్మార్వోలు బదిలీ

image

ప్రొద్దుటూరు ఎమ్మార్వో గంగయ్య కడప కలెక్టరేట్ ఏవోగా బదిలీ అయ్యారు. ప్రొద్దుటూరుకు కడప కలెక్టరేట్ AO విజయకుమార్ రానున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని 16 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేల్, బి.కోడూరు, చెన్నూరు, పులివెందుల, సింహాద్రిపురం, వేంపల్లె, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, రాజంపేట, కాశినాయన, నందలూరు, సుండుపల్లె ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

News March 16, 2026

NGKL: పోలీస్ ప్రజావాణికి 11 దరఖాస్తులు

image

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 11 దరఖాస్తుల స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 16, 2026

NTR: ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా

image

NTR జిల్లాలో పదో తరగతి తొలిరోజు పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్ లక్ష్మీశా, DEO చంద్రకళతో కలిసి గవర్నర్‌పేటలోని సీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.