News November 5, 2025
NGKL: ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే కట్టెల పొయ్యిలకు కాలం చెల్లింది. కట్టెల పొయ్యి ద్వారా వెలువడే పొగ వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వంట కార్మికులు అవస్థలు పడేవారు. ఈ సమస్యలు పరిష్కారం కోసం పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. పాఠశాలల హెడ్మాస్టర్లు గ్యాస్ కనెక్షన్ కోసం కలెక్టర్కు ప్రణాళికలు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.
Similar News
News January 25, 2026
16 రోజుల డిజిటల్ అరెస్ట్.. రూ.14 కోట్లు స్వాహా

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ NRI దంపతుల నుంచి ఏకంగా రూ.14.84 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. తాము CBI, పోలీసులమని చెప్పి నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి ఢిల్లీలో నివసిస్తున్న 77 ఏళ్ల మహిళ, ఆమె భర్తను 16 రోజుల పాటు వీడియో కాల్‌లో నిరంతరం నిఘా పెట్టారు. భయంతో బాధితులు తమ పెట్టుబడుల నుంచి డబ్బును వారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ కేసులో GJ, UP, ఒడిశా రాష్ట్రాల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News January 25, 2026
రథసప్తమి.. తిరుమలలో పటిష్ఠ బందోబస్తు

తిరుమలలో శ్రీవారి రథసప్తమి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, టీటీడీ సీవీ&ఎస్‌ఓ మురళీకృష్ణ కీలక ప్రాంతాలను పరిశీలించి బందోబస్తును సమీక్షించారు. భారీగా భక్తుల రాక నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పుష్కరిణి వద్ద అదనపు సిబ్బంది, జియో-ట్యాగింగ్ వంటి చర్యలు చేపట్టారు.
News January 25, 2026
సంగారెడ్డి: పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

సంగారెడ్డి జిల్లాలో వివిధ దాడుల్లో పట్టుబడిన అక్రమ పీడీఎస్ బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. గోదాముల్లో నిల్వ ఉన్న ఈ సరుకును “యథాతథం” పద్ధతిలో విక్రయించనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన బీవరేజెస్, డిస్టిలరీ సంస్థల నుండి సీల్డ్ కొటేషన్లను ఆహ్వానించారు. ఆసక్తి గల వారు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


