News May 7, 2025
NGKL: భారత్ సమిట్‌లో పాల్గొన్న మంత్రి జూపల్లి

హైదరాబాదులోని హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన భారత్ సమిట్ కార్యక్రమంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
Similar News
News February 16, 2026
పాకిస్థాన్‌పై గెలుపు.. ఇండియా సరికొత్త రికార్డు!

T20 WCలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా <<19153355>>అద్భుత విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక సార్లు గెలిచిన టీమ్‌గా రికార్డు సృష్టించింది. పాక్‌తో జరిగిన 9 మ్యాచుల్లో ఏకంగా 8 సార్లు భారత్ గెలిచింది. మరే జట్టూ దరిదాపుల్లో కూడా లేదు. బంగ్లాపై ఆస్ట్రేలియా, బంగ్లాపై పాకిస్థాన్, వెస్టిండీస్‌పై శ్రీలంక, ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ 6 విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.
News February 16, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 16, 2026
BREAKING: కడ్తాల్ వద్ద రెండు కార్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. NH 765పై రెండు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న నరేంద్ర చారి (37), ఎస్‌కే సైదులు (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


