News May 7, 2025

NGKL: భారత్ సమ్మిట్‌లో ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌లో శనివారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకూళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణాకు మేలు చేకూరుతుందని, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 13, 2026

తొర్రూర్: 9 వార్డులో మొత్తం 1282 ఓట్లు.. బీఎస్పీకి ఒక్క ఓటు రాలే!

image

తొర్రూర్ మున్సిపాలిటీలోని ​9వ వార్డులో అత్యంత ఉత్కంఠ పోరు నెలకొంది. 9వ వార్డు SC-W రిజర్వ్డ్ అయింది. అయితే, బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కిన్నెర కవిత 451 ఓట్లు సాధించి, కేవలం 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన(438 ఓట్లు)పై విజయం సాధించారు. ​ఈ వార్డులో మొత్తం 1282 ఓటర్లు ఉండగా.. 901 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 12 ఓట్లు రాగా.. బీఎస్పీకి ఒక్క ఓటు కూడా రాకపోవడం గమనార్హం.

News February 13, 2026

ఈనెల 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ కింద మెటీరియల్ పేమెంట్లను ఈనెల 15 నాటికి రూ.22.68 కోట్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. రోజుకు సుమారు రూ.7.35 కోట్ల పనులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలవు దినాలైనా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పాత పనులు పూర్తిచేసి పేమెంట్లు క్లియర్ చేయాలన్నారు.

News February 13, 2026

T20WC: USA భారీ స్కోర్

image

చెన్నై వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో USA చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. ముక్కమల్ల సాయితేజ 79 పరుగులతో సత్తా చాటారు. మరోవైపు శుభమ్ 24 బంతుల్లోనే 48 రన్స్ చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీశారు.