News August 13, 2025
NGKL: భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మరో 72 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బధావత్ సంతోష్ పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో పాల్గొనే అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా విపత్కర సమయంలో ఈ నంబర్లు 08540-23020, 230203 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
-SHARE IT
Similar News
News March 14, 2026
9వ తరగతి నుంచే ‘పదో తరగతి’కి సన్నద్ధం: కలెక్టర్

వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ బాలాజీ వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే 10వ తరగతి సిలబస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 2027 SSC పరీక్షల కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News March 14, 2026
1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం: శ్రీకాకుళం కలెక్టర్

జిల్లాలో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షలు 1,13,102 మంది మార్చి 15వ తేదీన రాయనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అభ్యాసకులకు అన్ని మండల, మున్సిపాలిటీ, గ్రామ వార్డుల పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో 1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News March 14, 2026
అనంతగిరిలో పుట్టింది.. HYDలో ఆగమైంది!

మనుషుల దాహాన్ని తీర్చి, పొలాలకు నీరందించే నదులు నేడు కన్నీరు పెడుతున్నాయి. మానవ అవసరాల కొరకు నదిలోని ఇసుక తవ్వేస్తున్నాడు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రసాయనాలను విడుదల చేసి నదులను కలుషితం చేస్తున్నాడు. నదులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు, మన సంస్కృతికి చిహ్నాలు. మన జిల్లాలోనే పుట్టి సర్వ నాశనం అయిన మూసీ ఇందుకు ఉదాహరణ. ఇకనైనా మేల్కొందాం.. రాజకీయాలకు అతీతంగా మన మూసీని కాపాడుకుందాం.


