News November 19, 2025

NGKL: మంత్రాలయానికి బస్సు.. ఫోన్ చేయండి!

image

కార్తీక బహుళ అమావాస్య పురస్కరించుకుని NGKL డిపో నుంచి డిలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’తో తెలిపారు. ఈనెల 20న NGKL నుంచి మధ్యాహ్నం బయలుదేరి, మంత్రాలయం(రాఘవేంద్ర స్వామి), పంచముఖి ఆలయం దర్శనం, ఆంజనేయ స్వామి ఆలయంలో బస ఉదయం పంచముఖి నుంచి బయలుదేరి జోగులాంబ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి ప్రయాణం అన్నారు. ఛార్జీ రూ.1000. వివరాలకు 94904 11591, 94904 11590కు ఫోన్ చేయాలన్నారు.

Similar News

News January 23, 2026

RTC బస్టాండ్‌లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సేవల పై పాజిటివ్ పర్సెప్షన్ మరింతగా మెరుగుపర్చేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో శుక్రవారం ప్రజారవాణా, రిజిస్ట్రేషన్ శాఖ, అగ్నిమాపక శాఖ అంశాల పై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీబస్టాండ్‌లో తాగునీరు, పరిశుభ్రత, సీటింగ్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర మౌలిక సౌకర్యాలు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

News January 23, 2026

రాష్ట్ర ఉత్తమ BLOగా పెనుగంచిప్రోలు VRO

image

పెనుగంచిప్రోలు VRO పర్చా సుధాశ్రీ రాష్ట్రస్థాయి ఉత్తమ BLO అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆమె పురస్కారం అందుకోనున్నారు. గతంలో జిల్లా ఉత్తమ BLOగా, ఉత్తమ VROగా సేవలు అందించిన ఆమెను తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది అభినందించారు. సుధాశ్రీ సాధించిన ఈ విజయంపై మండలంలో హర్షం వ్యక్తమవుతోంది.

News January 23, 2026

ఒక్కరోజులో 5.38 లక్షల మంది విమానయానం

image

దేశీయ విమానయానంలో 2025 NOV 23వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ ఒక్కరోజే 5,38,249 మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు. 3,356 విమానాలు దేశంలో రాకపోకలు సాగించాయి. గత 3 ఏళ్లలో రోజువారీ 5 లక్షల మందికి పైగా ప్రయాణించిన సందర్భాలున్నాయని విమానయాన శాఖ పేర్కొంది. కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి చోట్ల రీజనల్ కనెక్టివిటీ పెరగడం దీనికి కారణంగా వివరించింది.