News November 19, 2025
NGKL: మంత్రాలయానికి బస్సు.. ఫోన్ చేయండి!

కార్తీక బహుళ అమావాస్య పురస్కరించుకుని NGKL డిపో నుంచి డిలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’తో తెలిపారు. ఈనెల 20న NGKL నుంచి మధ్యాహ్నం బయలుదేరి, మంత్రాలయం(రాఘవేంద్ర స్వామి), పంచముఖి ఆలయం దర్శనం, ఆంజనేయ స్వామి ఆలయంలో బస ఉదయం పంచముఖి నుంచి బయలుదేరి జోగులాంబ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి ప్రయాణం అన్నారు. ఛార్జీ రూ.1000. వివరాలకు 94904 11591, 94904 11590కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News January 17, 2026
కేసీఆర్ నాకు శత్రువు కాదు: రేవంత్

TG: తనకెవరూ శత్రువులు లేరని, శత్రువు అనుకున్న వ్యక్తిని 2023లో బండకేసి కొట్టానని పాలమూరు సభలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ‘ఆయన నడుము విరిగి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే నేనెందుకు శత్రువు అనుకుంటా. ఆయన లేచి సరిగ్గా నిలబడ్డప్పుడు మాట్లాడతా. మహిళలకు అన్యాయం చేసేవాళ్లు, విద్యార్థులకు నష్టం కలిగించేవాళ్లు, చదువుకోకుండా ఊరిమీద పడి తిరిగేవాళ్లు, పేదరికమే నా అసలైన శత్రువులు’ అని వ్యాఖ్యానించారు.
News January 17, 2026
వికారాబాద్ మున్సిపల్ పీఠం ఎవరిది?

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రిజర్వేషన్ల ప్రకటనతో వికారాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్ పదవిని ఈసారి ఎస్సీ మహిళా కేటగిరీకి కేటాయించడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరి మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.
News January 17, 2026
కామారెడ్డి: మున్సిపల్ పోరు.. మహిళలకే అగ్రతాంబూలం

కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు ‘సగ’భాగం దక్కించుకున్నారు. నాలుగు పురపాలికల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించారు. కామారెడ్డిలో గరిష్ఠంగా 24 స్థానాలు, బాన్సువాడలో 9, ఎల్లారెడ్డి, బిచ్కుందల్లో ఆరేసి సీట్లు మహిళల పరమయ్యాయి. దీంతో మున్సిపల్ పీఠాలపై ఈసారి నారీమణుల జెండా రెపరెపలాడటం ఖాయంగా కనిపిస్తోంది.


