News February 27, 2025
NGKL: మహాశివరాత్రి రోజు సింగోటంలో అద్భుతం.!

సింగోటంలోని శివకేశవ రూపమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శివరాత్రి వేళ అరుదైన దృశ్యం వెలుగు చూసింది. మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమాలలో భాగంగా స్వామి వారికి అభిషేకం చేస్తుండగా సూర్య కిరణాలు స్వామివారి నిజస్వరూప దర్శనంపై పడటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు ఆలయ పూజారి సతీష్ శర్మ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగిందన్నారు.
Similar News
News February 27, 2025
MTM: సెయింట్ ఫ్రాన్సిస్‌లో ఓటు వేసిన కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మచిలీపట్నం సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కలెక్టర్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 27, 2025
లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించిన WGL కలెక్టర్

వరంగల్ కలెక్టర్లో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాల ఓటింగ్ విధానంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News February 27, 2025
నల్గొండ: కల్లు గీస్తుండగా పాముకాటుతో మృతి

నార్కట్ పల్లి మండలం తొండల్ వాయికి చెందిన గీత కార్మికుడు దంతూరి శంకర్ బుధవారం సాయంత్రం పాముకాటుతో మరణించారు. గ్రామ సమీపంలోని తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పాము కాటు వేసిందని, కిందికి దిగిన శంకర్ తోటి గీత కార్మికుడికి విషయం చెప్పి కిందపడిపోయాడని స్థానికులు తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.