News October 5, 2025

NGKL: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడినందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 19, 2026

భద్రకాళి క్షేత్రంలో మాఘ నవరాత్రుల వైభవం

image

ఓరుగల్లు ఆరాధ్యదైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మాఘ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి శాస్త్రోక్తంగా ‘పూర్ణాభిషేకం’ నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్ప మాలలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు, హారతులు సమర్పించారు. ప్రాతఃకాల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

News January 19, 2026

నేటి నుంచి సర్పంచులకు శిక్షణ.. పంచాయతీ పాలనపై అవగాహన

image

నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణలో పంచాయతీరాజ్ చట్టం, గ్రామ పాలన, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశారు. జిల్లాలోని 869 పంచాయతీలకు గాను 866 గ్రామాల్లో పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో, వారికి తమ విధులు, బాధ్యతలపై పూర్తిస్థాయిలో పాఠాలు నేర్పనున్నారు.

News January 19, 2026

సర్పంచులకు పాఠాలు.. భద్రాద్రి జిల్లాలో శిక్షణకు సర్వం సిద్ధం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఎన్నికైన 468 మంది సర్పంచులకు రెండు విడతల్లో శిక్షణ ఇచ్చేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పాల్వంచ నవభారత్‌లోని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల పాటు ఈ తరగతులు జరగనున్నాయి. తొలి విడత శిక్షణ నేటి నుంచి 23 వరకు, రెండో విడత ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు కొనసాగనుంది.