News April 10, 2024

నితీశ్ ఓ అద్భుతం: కమిన్స్

image

నితీశ్ కుమార్ రెడ్డి ఒక అద్భుతమని SRH కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నారు. ‘సీఎస్కేతో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ చూశాం. అందుకే పంజాబ్‌తో మ్యాచ్‌లో నితీశ్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పించాం. మా నమ్మకాన్ని నిలబెట్టి అర్ధసెంచరీ చేశాడు. SRH విజయానికి అతడే ముఖ్య కారణం. మరోవైపు బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా సత్తా చాటాడు. పాజిటివ్ మైండ్‌‌సెట్‌తో ఆడి విజయాలు సాధించడమే మా లక్ష్యం’ అని కమిన్స్ పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

యువతిపై లైంగిక వేధింపులు.. పోలీసులు కేసు తీసుకోలేదా..?

image

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతికి సంబంధించిన వివాదంపై పలు ప్రచారాలు సాగుతున్నాయి. యువతి తరఫున ముగ్గురు గత నెల 24, 25న స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా తీసుకోలేదని సమాచారం. దీంతో యువతి మరోదారి లేక టీసీ తీసుకుని వెళ్లిపోయిందన్న చర్చ జోరుగా నడుస్తోంది.

News December 6, 2025

నెరవేరిన హామీ.. 3KM సాష్టాంగ నమస్కారాలు

image

ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడంతో 3కి.మీ మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఓ MLA ఆలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని ఔసా BJP MLA అభిమన్యు కొన్ని నెలల కిందట కిల్లారి గ్రామంలో పర్యటించారు. అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో అభిషేకం చేశారు.

News December 6, 2025

అభిషేక్ ఊచకోత.. ఈ ఏడాది 100 సిక్సర్లు

image

విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.