News April 26, 2024

NKL: విషాదం.. వడదెబ్బతో టీచర్ మృతి

image

నకిరేకల్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న బోడ ఆశ్రిత వడదెబ్బతో మృతి చెందింది. గత నాలుగు రోజులుగా అడ్మిషన్స్ కోసం ఎండలో క్యాంపెయిన్ చేస్తూ అస్వస్థకు గురై.. మృతి చెందింది. ఈ ఘటనతో అమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఎండ తీవ్రతకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News April 19, 2026

నల్గొండలో 21న మినీ జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 21న నల్గొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో (ఐటిఐ క్యాంపస్) ‘మినీ జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎస్. పద్మ తెలిపారు. ఈ మేళాకు SSC, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన 18-30 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. ఎంపికైన వారికి హైదరాబాద్, నల్గొండ పరిసర ప్రాంతాల్లో రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు వేతనం ఉంటుందని తెలిపారు.

News April 18, 2026

NLG: 60,389 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

image

జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 60,389 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 60,221 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 168 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం సేకరించారు. ఈ ప్రక్రియ ద్వారా 7,077 మంది రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 444 కొనుగోలు కేంద్రాలకు గాను, ప్రస్తుతం 373 కేంద్రాలు పనిచేస్తున్నాయి.