News March 27, 2024

NLG: అంగన్ వాడి టీచర్లపై పెరిగిన పని భారం

image

ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీ టీచర్లపై పని భారం పెరిగింది. ఇప్పటికే అంగన్‌వాడీ సేవలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తుండగా.. తాజాగా అంగన్వాడి టీచర్లకే NHTS కుటుంబ సర్వే కూడా అప్పగించారు. స్మార్ట్ ఫోన్లలో ర్యాం, స్టోరేజీ తక్కువగా ఉండడంతో సతాయిస్తున్నాయి. గ్రామాలలో నెట్ సేవలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆన్లైన్ కుటుంబ సర్వేకు ఆటంకం కలుగుతుంది.

Similar News

News February 18, 2026

రైతులందరికీ ‘డిజిటల్‌’ గుర్తింపు ఉండాల్సిందే: కలెక్టర్

image

జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 5.54 లక్షల మంది పట్టాదారులు ఉండగా, కేవలం 2.41 లక్షల మందే నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ నమోదు ఆవశ్యకమని, మీ-సేవ లేదా ఏఈఓల ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

News February 18, 2026

NLG: రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ

image

రేషన్ బియ్యం ఈ నెల 19వ తేదీ వరకు సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాసన రఘునందన్ తెలిపారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా కారణాలతో రేషన్ తీసుకోని వారికి అవకాశం ఉందని తెలిపారు.

News February 18, 2026

నల్గొండ: ఇంటర్ పరీక్షలకు సిద్ధం

image

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయగా, మొత్తం 27,018 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.