News April 12, 2024

NLG: అప్రకటిత కోతలతో ఇక్కట్లు..

image

నల్గొండ జిల్లా కేంద్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గంటల తరబడి కరెంట్ తీసేస్తుండటంతో ఇళ్ల నుంచి పని (వర్క్ ఫ్రం హోం) చేస్తున్న పలువురు ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఆయా షిప్టు సమయాల్లో విద్యుత్ ఉండకపోవడంతో అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోతుండటంతో ఒత్తిడి పెరుగుతోందన్నారు.

Similar News

News December 10, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: నల్గొండ ఎస్పీ

image

మొదటి విడత పోలింగ్ జరగనున్న కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

News December 10, 2025

నల్గొండ: ‘తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి’

image

నల్గొండ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మొత్తం 14 మండలాల్లోని 318 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు 7,000 మంది సిబ్బంది నియమించగా, 5,600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి మండలానికి డీఆర్సీ కేంద్రాలు, రూట్, జోనల్ అధికారులు నియమించారు. పోలింగ్ సిబ్బందికి వసతి, భోజనం, కిట్‌లతో సహా అన్ని సౌకర్యాలు కల్పించారు.

News December 10, 2025

NLG జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

image

NLG జిల్లాలో చండూరు, నల్లగొండ డివిజన్లలో మొత్తం 14 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
✈ సర్పంచ్ స్థానాలు: 294
✈ అభ్యర్థులు: 966 మంది
✈ వార్డు స్థానాలు: 2870
✈ అభ్యర్థులు: 5934 మంది
✈ పోలింగ్ కేంద్రాలు: 2870
✈ ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
✈ పీవోలు (పోలింగ్ అధికారులు): 3444 మంది
✈ ఉప పీవోలు: 4448 మంది