News October 6, 2025

NLG: అభ్యర్థుల కోసం అన్వేషణ.. పార్టీల వ్యూహాలు

image

నల్గొండ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజారిటీ సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో 33 జెడ్పీటీసీ, 353 ఎంపీటీసీ, 33 ఎంపీపీ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల పేర్లను సేకరించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఎన్నికల కోసం ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు.

Similar News

News January 23, 2026

బాపట్ల జిల్లాలో మరో ప్రమాదం.. నుజ్జనుజ్జైన మహిళ తల

image

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన భట్టిప్రోలులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శివయ్య వివరాల మేరకు.. భట్టిప్రోలు బస్టాండ్ సెంటర్‌లో అదే గ్రామానికి చెందిన రాజకుమారి(37) భర్త శ్రీనుతో నడచి వెళ్తుండగా చెరుకుపల్లి నుంచి వస్తున్న లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజకుమారి తల నుజ్జునుజ్జైంది. ఆమె భర్త శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News January 23, 2026

RS ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు

image

TG: బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, 2 రోజుల్లో ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ ‘సజ్జనార్‌పై 7 ట్యాపింగ్ కేసులు ఉన్నాయి. ఆయనపైనే లోతైన విచారణ జరగాలి. ఆయన్ను సిట్ చీఫ్‌గా ఎలా నియమిస్తారు. ఆయన ఎలా ట్యాపింగ్ కేసును విచారిస్తారు?’ అని ప్రశ్నించారు.

News January 23, 2026

HNK: పరీక్ష హాల్‌లో సెల్‌ఫోన్.. ఆన్సర్ షీట్ వైరల్!

image

ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ లోపం హనుమకొండ జిల్లాలో బట్టబయలైంది. SR ప్రైమ్ కళాశాలలో జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షా కేంద్రంలోకి ఓ విద్యార్థి నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా జవాబు పత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగాల్సిన పరీక్షల్లో ఫోన్ లోపలికి ఎలా వచ్చిందో?