News April 7, 2024

NLG: ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించేనా?

image

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. టెట్ పాసైతేనే పదోన్నతులకు అర్హులని ఎస్ఈఆర్టీ నిబంధనలు విధించింది. ఎప్పుడో ఉద్యోగాలు పొందిన తాము ప్రస్తుతం పదోన్నతులు పొందేందుకు టెట్ తప్పనిసరి పాస్ కావాలనే నిబంధన పెట్టడం ఏమిటని ఉపాధ్యాయులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రస్తుతం టెట్ అర్హత సాధించడం సాధ్యమయ్యే పని కాదని, మా కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Similar News

News January 23, 2025

నల్లగొండ: పరీక్షలు వాయిదా వేయాలని వినతిపత్రం

image

జనవరి 30 నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరగనున్న LLB మూడు, ఐదు సంవత్సరాల మొదటి సంవత్సర మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని NSUI అధ్యక్షుడు సర్దార్ నాయక్ ఆధ్వర్యంలో COEకి వినతిపత్రం అందజేశారు. మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్స్ ప్రక్రియ ఆలస్యమైన కారణంగా పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తి కాలేదన్నారు. ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి తక్కువ సమయం ఉన్నందున విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.

News January 23, 2025

NLG: నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు

image

సూర్యాపేట జిల్లాలో జాన్ పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. మూడు రోజులపాటు నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దలకు ఛార్జీ రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించామన్నారు. నల్గొండ, మిర్యాలగూడెం నుంచి వచ్చే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.

News January 23, 2025

కొత్త రేషన్ కార్డుల కోసం 13,921 దరఖాస్తులు: కలెక్టర్

image

ప్రజాపాలన గ్రామసభల నిర్వహణలో భాగంగా బుధవారం జిల్లాలో 221 గ్రామ సభలు,47 మున్సిపల్ వార్డు సభలు మొత్తం 268 గ్రామ ,వార్డు సభలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు గడచిన రెండు రోజులు కలుపుకొని 444 గ్రామసభలు, 95 మున్సిపల్ వార్డుల సభలను నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. బుధవారం రేషన్ కార్డుల కోసం 13,921 కొత్త దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు.