News September 10, 2025

NLG: ఏటేటా తగ్గుతున్న కూరగాయల సాగు

image

జిల్లాలో కూరగాయల సాగు ఏటేటా తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ శాతం MNGD, DVK, సాగర్, NKL నియోజకవర్గాల్లో కూరగాయల సాగు ఎక్కువగా చేపడుతున్నారు. సాగు గిట్టుబాటుకాకపోవడం, ప్రభుత్వం రాయితీలు కల్పించకపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, దళారులు రంగప్రవేశం చేయడం వంటి కారణాలతో రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదేళ్ల క్రితం 42 వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. ప్రస్తుతం 80 శాతం సాగు పడిపోయింది.

Similar News

News December 17, 2025

నల్గొండ: ఓట్ల కోసం నోట్ల వరద.. రూ.కోట్లలో ఖర్చు

image

నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం హద్దులు దాటిందని ప్రజలు అంటున్నారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. చిన్న పంచాయతీల్లో రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేయగా, కీలక పంచాయతీల్లో అభ్యర్థులు రూ.కోటికి మించి పంపిణీ చేశారన్నారు. గెలిచినవారితో పాటు ఓడినవారు కూడా ఖర్చును తలచుకుని మదనపడుతున్నారు. క్రాస్ ఓటింగ్‌తో లెక్కింపు ఉత్కంఠగా మారింది.

News December 17, 2025

NLG: ‘లెక్కలు చెప్పాల్సిందే..! లేదంటే వేటు తప్పదు’

image

జిల్లాలో తొలి, మలి విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును MPDOలకు తెలియజేసి రశీదు తీసుకోవాలి. లేదంటే వేటు పడే ప్రమాదం ఉంది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు సమర్పించాలని ఎంపీడీవో జ్ఞానప్రకాశరావు తెలిపారు.

News December 17, 2025

నల్గొండ: @9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

image

నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాలలో 9 గంటల వరకు 29.46% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఓటర్లు 2,53,689 ఉండగా 41,285 పురుషులు, 33,439 మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.