News August 11, 2025
NLG: గొంతు తడవాలంటే పక్క ఊరికి వెళ్లాల్సిందే..!

స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఉమ్మడి NLG జిల్లాలో కొన్ని గ్రామాల్లో నేటికీ మౌలిక వసతులు కొరవడుతున్నాయి. కొన్ని పల్లెల్లో తాగునీటి కొరత ఉండగా, మరికొన్ని చోట్ల రోడ్లు లేవు. వర్షాలు వస్తే కొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలే ఉండవు. కొండమల్లేపల్లి (M) గుమ్మడవల్లి వాసులు 2 నెలలుగా పక్క గ్రామాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మీ గ్రామంలో ఉన్న సమస్యలేంటి..?
Similar News
News March 16, 2026
అవతార్‌కు ఆస్కార్.. విమర్శలు!

అవతార్ ఫైర్ అండ్ యాష్‌కు విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. అయినా ఆస్కార్ రావడంపై కొందరు IND సినీ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. హాలీవుడ్‌లో సినిమాలు ఎలా ఉన్నా ఆస్కార్ ఈజీగా వస్తుందని, భారతీయ చిత్రాలు ఎంత బాగా తీసినా ఇవ్వరని కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజువల్ వండర్ కావడంతోనే అవతార్‌కు అవార్డు వచ్చిందని మరికొందరు అంటున్నారు. మీ కామెంట్?
News March 16, 2026
కామారెడ్డి జిల్లాలో భిన్న వాతావరణం

కామారెడ్డి జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు ఈదురుగాలులతో కూడిన ఉరుముల, మెరుపుల వడగళ్ల వాన పడింది. గడిచిన 24గంటల్లో నమోదైన వాతావరణ వివరాలిలా ఉన్నాయి. జుక్కల్ 39°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా 29 వెదర్ స్టేషన్లలో 35°C పైన, 3చోట్ల 30°C పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాంధారి(M)సర్వాపూర్ లో 8.5మి.మీ నమోదు కాగా పలు మండలాల్లో సైతం వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
News March 16, 2026
మేడ్చల్: 793 అంగన్వాడీల్లో ఒంటిపూట బడులు

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలోని 793 అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఈ కేంద్రాలు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. చిన్నారులకు విద్యాబోధనతో పాటు పౌష్టికాహారం అందించి ఇంటికి పంపించనున్నారు.


