News November 8, 2025

NLG: చర్చలు ఫలప్రదం.. బంద్ విరమణ

image

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్‌కు తెరపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈనెల 3 నుంచి నిరవధిక బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం కళాశాలల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నిర్ణయంతో శనివారం నుంచి కళాశాలలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.

Similar News

News January 16, 2026

రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన MSVPG

image

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్ల లోపల ఈలలు, బయట హౌజ్‌ఫుల్ బోర్డులు.. రూ.200 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు’ అని రాసుకొచ్చింది. వీకెండ్ కావడంతో రేపు, ఎల్లుండి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.

News January 16, 2026

IFFCOలో అప్రెంటిస్ పోస్టులు

image

<>IFFCO <<>>అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీఎస్సీ, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు జనవరి 29 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైన వారికి ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iffco.in/

News January 16, 2026

ముత్యపు ఉంగరం ధరించడం వల్ల ప్రయోజనాలు

image

చంద్రుడికి ప్రతీక ముత్యాన్ని భావిస్తారు. ఆ ఉంగరం ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. అసలైన ముత్యాన్ని వెండి ఉంగరంలో పొదిగించి సోమవారం ధరిస్తే మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయట. ఇది కోపం, ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. అలాగే మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు ఇది మేలు చేస్తుందట. నకిలీ ముత్యంతో లాభాలు ఉండవట.