News May 1, 2024
NLG: జానారెడ్డి అదృష్ట వంతుడు: కోమటిరెడ్డి

ప్రధాని మోదీ తమ లెక్కలోనే లేరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. జానారెడ్డి అదృష్ట వంతుడని.. ఒక కొడుకు ఎమ్మెల్యే.. మరో కొడుకు భారీ మెజార్టీతో ఎంపీగా గెలువబోతున్నారని జోస్యం చెప్పారు.
Similar News
News December 15, 2025
NLG: సాఫ్ట్‌వేర్ TO సర్పంచ్

సొంతూరుకు సేవచేయాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన యువకుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా అనుముల (M)ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎడవల్లి వంశీకృష్ణ విజయం సాధించారు. వంశీకృష్ణ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.
News December 15, 2025
NLG: రెండో విడతలోనూ ఆ పార్టీదే హవా

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు. మొదటి రెండో విడతలో 597 స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 407 స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 146 స్థానాలు గెలుపొందారు. సీపీఐ, సీపీఎం, ఇతరులు కలుపుకొని రెండు విడతల్లో 40 మంది గెలుపొందగా.. బీజేపీ 4 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. రెండో విడతలోను బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు.
News December 15, 2025
MLG: రెండో విడతలో తగ్గిన పోలింగ్ శాతం

మొదటి విడతలో కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో NLG, CDR రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.53 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో MLG డివిజన్ లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 88.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 92.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మిర్యాలగూడలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది.


