News March 6, 2025

NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

image

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్‌ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.

Similar News

News December 16, 2025

ఉప సర్పంచ్‌గా మెదక్ ఎంపీ కారు డ్రైవర్

image

మెదక్ MP రఘునందన్ రావు కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాయి చరణ్ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో మొదటి వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత గ్రామంలోని వార్డు సభ్యుల సహకారంతో ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సాయి చరణ్‌ను అభినందించారు.

News December 16, 2025

IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

image

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

News December 16, 2025

విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

image

విశాఖలో మంత్రి లోకేశ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన తనకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని సతీశ్వరరెడ్డి కోరారు. కోనసీమ, పోలవరంలో గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలనీ కోరారు.