News April 25, 2024

NLG: నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 505.70 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 124.4864 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 6,841 క్యూసెక్కులు ఉంది.

Similar News

News April 14, 2026

ఎంజీయూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల విడుదల

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 113 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. గతంలో వీరికి సంబంధించిన ఏజెన్సీ సుమారు 99 లక్షల రూపాయల జీఎస్టీ బకాయి పడటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో స్తంభించిన వేతనాల చెల్లింపునకు ప్రత్యామ్నాయంగా మరో ఏజెన్సీ ద్వారా నిధులు విడుదల చేస్తూ వర్సిటీ యంత్రాంగం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.

News April 14, 2026

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రావద్దు: కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయాలని స్పష్టం చేశారు.