News March 6, 2025

NLG: నియోజకవర్గం చొప్పున మోడల్ పీహెచ్‌సి: మంత్రి కోమటిరెడ్డి

image

రానున్న రెండు మాసాలలో నల్గొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మోడల్ పిహెచ్‌సిలుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయన నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రంలో రూ.కోటి 56 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.

Similar News

News December 15, 2025

టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

image

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.

News December 15, 2025

పెరగనున్న టీవీల ధరలు!

image

కొత్త ఏడాదిలో TVల ధరలు పెరిగే అవకాశం ఉంది. మెమొరీ చిప్‌ల కొరత, రూపాయి పతనం, దిగుమతి వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో జనవరిలో 3 నుంచి 10% వరకు టీవీల ధరలు పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని తయారీ కంపెనీలు డీలర్లకు ఈ విషయం తెలియజేశాయని పేర్కొంటున్నాయి. గత మూడేళ్లలో మెమొరీ చిప్‌ల ధరలు 500% ఎగిశాయని, వచ్చే 6 నెలలూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.

News December 15, 2025

SRD: సర్పంచ్ అభ్యర్థి సూసైడ్.. చనిపోయి గెలిచిన రా’రాజు’

image

నమ్మినవారే మోసం చేశారు. డబ్బు ఉన్నంత సేపు అతనితో ఉండి డబ్బు అయిపోయాక ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపడ్పల్లి సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ నిన్న వెలువడిన ఫలితాల్లో గ్రామస్థులు అభిమానం చాటారు. చాల్కి రాజుకు 699 ఓట్లు పోలయ్యాయి. దీంతో 9 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.