News March 10, 2025

NLG: నేటి నుంచి ఇంటర్ పేపర్ వ్యాల్యూయేషన్

image

ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుందని డీఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు.. ఈ 10న సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుందనన్నారు. మిగిలిన సబ్జెక్టులు ఈనెల 20, 22, 26న ప్రారంభమవుతాయన్నారు. బోర్డు ఆదేశాల మేరకు పటిష్ఠంగా మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News January 21, 2026

NLG: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు: ఎస్పీ పవార్‌

image

నల్గొండ జిల్లాలో నేరాల అదుపునకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి, సైబర్‌ నేరాల పట్ల ఉక్కుపాదం మోపాలని సూచించారు.

News January 21, 2026

NLG: జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌

image

నల్గొండ జిల్లా కారాగారానికి నూతన సూపరింటెండెంట్‌గా కె. ఆనందరావు నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ పదోన్నతిపై చర్లపల్లి కేంద్ర కారాగారానికి బదిలీ అయ్యారు. కె.ఆనందరావు గతంలో కేంద్ర కారాగారం నిజామాబాద్‌లో విధులు నిర్వహించారు. పరిపాలనా అనుభవం కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన నల్గొండ జిల్లా కారాగార అభివృద్ధికి కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News January 21, 2026

NLG: వేసవిలో దాహార్తి తీర్చేలా ముందస్తు ప్రణాళిక

image

జిల్లాలోని ప్రతి పల్లెకూ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా ‘ప్రత్యేక డ్రైవ్’ చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని బోర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.