News November 16, 2025

NLG: పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

image

పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షించారు. రైతుల సంక్షేమం దృష్ట్యా సోమవారం తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు ఇప్పుడు 12 క్వింటాళ్ల వరకు పత్తిని అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

Similar News

News January 21, 2026

డిండి: విద్యార్థులను పరామర్శించిన డీఈవో

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న డిండి మోడల్ స్కూల్ విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, యూటీఎఫ్ నాయకులు బుధవారం పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు. విద్యార్థులు కోలుకునే వరకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని డీఈవో భరోసా ఇచ్చారు.

News January 21, 2026

NLG: మహిళా సాధికారతే లక్ష్యం: కలెక్టర్ చంద్రశేఖర్

image

గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు డిపిఎంలు, ఏపీఎంలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల బలోపేతం, ‘ఉల్లాస్ అక్షరమాల’ ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాలు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలన్నారు.

News January 21, 2026

NLG: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు: ఎస్పీ పవార్‌

image

నల్గొండ జిల్లాలో నేరాల అదుపునకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి, సైబర్‌ నేరాల పట్ల ఉక్కుపాదం మోపాలని సూచించారు.