News November 8, 2025

NLG: పలువురు జడ్జీలకు స్థానచలనం

image

ఉమ్మడి నల్గొండలో పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. NLG జిల్లా కోర్టు 3వ అదనపు జడ్జి డి.దుర్గాప్రసాద్ నిజామాబాద్‌కు, MLG కోర్టు 5వ అదనపు జడ్జి జి.వేణు సికింద్రాబాద్‌కు, సీనియర్ సివిల్ జడ్జి బి.సుజయ్ HYD కోర్టుకు బదిలీ అయ్యారు. ఖమ్మం జిల్లా కోర్టులో పనిచేస్తున్న కెవి.చంద్రశేఖరరావు MLG కోర్టుకు, HZNR కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం.రాధాకృష్ణ చౌహన్ SRPT కోర్టు మొదటి అదనపు జడ్జిగా బదిలీ అయ్యారు.

Similar News

News January 13, 2026

సంక్రాంతి: పంతంగి టోల్ నుంచి 25 వేల వాహనాలు పాస్

image

చౌటుప్పల్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంత ఊళ్లకు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పంతంగి టోల్ గేట్ గుండా మంగళవారం అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సుమారు 25 వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ గేట్ అధికారులు తెలిపారు. వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగాయని పేర్కొన్నారు.సాయంత్రం వరకు వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

News January 13, 2026

BREAKING.. పాలమూరు: రోడ్డు ప్రమాదం.. తల్లీకుమార్తె మృతి

image

MBNR(D) మూసాపేట మండలంలోని గాజులపేట స్టేజీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. HYD నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బైకును వెనక నుంచి లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో నంద్యాల(D) ముచ్చుమర్రి వాసులు నాగమణి, ఏశ్నలు మరణించారు. గాయపడిన తిరుపతయ్యను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 13, 2026

ఆభరణాలు నల్లగా మారాయా? ఇలా చేయండి

image

☛ఒక గిన్నెలో డిష్‌వాష్ లిక్విడ్ వేసి అందులో నగలు నాననివ్వాలి. తర్వాత మెత్తని బ్రష్‌తో తోమి శుభ్రం చేస్తే మునుపటి రూపు సంతరించుకుంటాయి.
☛ డిటర్జెంట్ పౌడర్, ఒక చెక్క నిమ్మరసం వేడి నీటిలో కలిపి ఆభరణాలను వేసి 5నిమిషాలు ఉంచాలి.
☛బంగారు గాజులను నీటిలో నానబెట్టి రెండు చెంచాల శనగపిండిలో తగినంత వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించాలి. తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి.