News April 20, 2024
NLG: పాలీసెట్ ప్రవేశ పరీక్ష తేదీ మార్పు

పాలీసెట్-2024 ప్రవేశ పరీక్ష తేదీ షెడ్యూల్లో మార్పు జరిగినట్లు NLG పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.జానకీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మే 17న జరగాల్సిన పరీక్ష 24వ తేదీకి మార్చినట్లు చెప్పారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కళాశాలలో సివిల్ మెకానిక్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ మూడేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: ధాన్యం కొనుగోలులో వేగంపై కమిషనర్ ఆదేశాలు

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో పారదర్శకత, వేగం పెంచాలని గురువారం రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కొనుగోలు కేంద్రాలు, పేమెంట్ జాప్యం, సీఎంఆర్ సరఫరా, రవాణా వ్యవస్థపై సమీక్ష చేసి, పూర్తి డిజిటలైజేషన్‌తో ట్యాబ్ ద్వారా తేమ, తూకం, రైతు రిజిస్ట్రేషన్ వివరాలు పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో పేమెంట్లు రైతుల ఖాతాల్లో జమ కావాలని ఆదేశించారు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. నల్గొండ జిల్లా వ్యయ పరిశీలకుడిగా ఆదిత్య

నల్గొండ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎస్.వెంకట్ ఆదిత్యను జిల్లా వ్యయ పరిశీలకుడిగా గురువారం నియమించారు. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ, అభ్యర్థుల ఖర్చుల నమోదు, అక్రమ ఖర్చుల నియంత్రణపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తారని అధికారులు తెలిపారు.
News December 5, 2025
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నల్గొండ కలెక్టర్

ఎస్ఈసీ కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి జిల్లాలకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, పంచాయితీరాజ్, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని జిల్లాలో చేసిన ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. పోటీ లేకుండా జరిగే గ్రామ పంచాయతీల్లో కూడా కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.


