News September 11, 2025
NLG: పోక్సో కేసులో సంచలన తీర్పు

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి NLG పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. జడ్జి రోజా రమణి ఈ కేసులో తీర్పును వెలువరించారు. నిందితుడు హరీష్‌కు 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసు విచారణలో పోలీసులు సమర్పించిన శాస్త్రీయ ఆధారాలు కీలకమయ్యాయి. కామాంధులకు హెచ్చరికగా నిలిచిన ఈ తీర్పు జిల్లాలో సంచలనంగా మారింది.
Similar News
News December 7, 2025
కోటగుళ్లలో సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు

గణపురం మండలం కోటగుళ్లలోని గణపేశ్వరాలయంలో ఆదివారం భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి తీర్థప్రసాదాల అందజేశారు.
News December 7, 2025
గద్వాల ఫ్లై ఓవర్ వద్ద సూచిక బోర్డు ఏర్పాటు

గద్వాల ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రవీంద్ర పాఠశాల పూర్వ విద్యార్థులు కలిసి ఒక సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదని, ఆ సమయంలో అవి ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లాలని ఈ బోర్డు ద్వారా సూచించారు.
News December 7, 2025
అన్ని జిల్లాల్లో క్రీడా పోటీలు: ACA అధ్యక్షుడు చిన్ని

AP: రాష్ట్రంలో శాప్‌తో కలిసి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని క్రీడలను ప్రోత్సహిస్తామని MP, ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. అన్ని జిల్లాల్లో క్రీడా పోటీలు నిర్వహించేందుకు CM CBN కృషి చేస్తున్నారని తెలిపారు. కిదాంబి శ్రీకాంత్‌తో కలిసి 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లోగో, పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కాగా ఈ పోటీలు విజయవాడలో ఈ నెల 22 నుంచి 28 వరకు జరగనున్నాయి.


