News November 19, 2025

NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

image

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.

Similar News

News January 13, 2026

కలెక్టరేట్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

image

అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కలెక్టర్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు నిర్వహించారు. కోనసీమ సంస్కృతి, ఐక్యత ప్రతిబింబించేలా పండుగ జరుపుకోవాలని ఆయన సిబ్బందికి పిలుపునిచ్చారు. అధికారులు, ఉద్యోగులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు. కార్యాలయం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

News January 13, 2026

కామారెడ్డి: సమ్మె బాటలో ఎన్ హెచ్ఎం ఉద్యోగులు

image

గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె బాటకు వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విద్య కు సమ్మె నోటీసు అందించారు. వారు మాట్లాడుతూ.. రేయింబవళ్ళు కష్టపడుతున్న తమకు వేతనాలు సరైన సమయానికి అందించకపోవడమే కాకుండా తాత్సారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి సమ్మెకు వెళ్తామని ఆమెకు తెలిపారు.

News January 13, 2026

కోదాడ: 3 ముక్కలుగా విరిగిన కోడి తొడ.. ఎముకకు పిన్నింగ్‌తో జాయింట్

image

కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్ పెంటయ్య మూగ జీవాలకు వినూత్న చికిత్సలు చేసి వాటికి ప్రాణం పోస్తున్నారు. ఇందులో భాగంగా మూడు ముక్కలుగా విరిగిన కోడి తొడ ఎముకలకు పిన్నింగ్ ద్వారా అతికించి కోడి తిరిగి యధావిధిగా నడిచే విధంగా చికిత్స అందించారు. కాగా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస రావు.. డాక్టర్ పెంటయ్య వినూత్న చికిత్సా విధానాన్ని అభినందించారు.