News November 19, 2025

NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

image

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.

Similar News

News January 24, 2026

MHBD: రోడ్ సేఫ్టీ అవగాహన కోసం బైక్ ర్యాలీ: SP

image

రోడ్డు భద్రతపై అవగాహన కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 6:30 గంటలకు తలపెట్టనున్న బైక్ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ డాక్టర్ శబరిష్ సూచించారు.“Arrive Alive” కార్యక్రమంలో భాగంగా MHBD టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందాన్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్యే మురళి నాయక్ బైక్ ర్యాలీకి హాజరుకానున్నట్లు తెలిపారు.

News January 24, 2026

MHBD: డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల, డ్రగ్స్‌ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై జిల్లా స్థాయి నార్కోటిక్‌, నార్కోటిక్‌ కంట్రోల్‌ సమావేశంలో జిల్లాలో నమోదు అవుతున్న ఎన్‌డీపీఎస్‌ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

News January 24, 2026

జనవరి 24: చరిత్రలో ఈరోజు

image

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్‌ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం