News November 19, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.
Similar News
News January 19, 2026
స్పెయిన్ రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య

దక్షిణ స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 39కి చేరింది. మలగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న ఇరియో హైస్పీడ్ రైలు అడముజ్ సమీపంలో పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 రైళ్ల బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పదేళ్ల కాలంలో స్పెయిన్‌లో జరిగిన అత్యంత భయంకరమైన రైలు ప్రమాదం ఇదే.
News January 19, 2026
విశాఖ: ఫిర్యాదులు చేసేందుకు ఎవరూ రాలేదు!

ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ 10 గంటలకు ప్రారంభమైనా ఫిర్యాదుదారులు కనిపించలేదు. మరోవైపు అధికారులు కూడా సగానికి పైగా లేకపోవడం విశేషం. అన్ని సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో వచ్చిన వారు విస్తుపోతున్నారు. పండగ ఎఫెక్ట్ కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని పలువురు భావిస్తున్నారు.
News January 19, 2026
మాస్టర్‌చెఫ్ ఇండియాలో మెరిసిన ‘HYD ఫైర్ పాన్ వాలా’

భాగ్యనగరపు అద్భుతమైన ఆహార వైభవం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విభిన్నమైన శైలితో HYD వీధుల్లో ‘ఫైర్ పాన్ వాలా’గా గుర్తింపు పొందిన హుస్సేన్, ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 9’లో అడుగుపెట్టారు. వేల రకాల పాన్‌లను తయారు చేయడంలో రికార్డు సృష్టించిన హుస్సేన్, వీల్‌చైర్‌కే పరిమితమైనా తన ఆత్మవిశ్వాసంతో మాస్టర్‌చెఫ్ వేదికపై జడ్జీలను ఆశ్చర్యపరిచారు.


