News November 19, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.
Similar News
News January 14, 2026
తాండూర్: స్కూల్‌కు వెళ్లమన్నందుకు సూసైడ్

తాండూర్ మండలం నీలాయపల్లిలోని వడ్డెర కాలనీ చెందిన రుద్ర హనీతేజ (15) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు మాదారం ఎస్ఐ సౌజన్య తెలిపారు. హనీ తేజ తంగళ్లపల్లి ZPSSలో టెన్త్ చదువుతున్నాడు. డిసెంబర్ 21న స్కూలుకు వెళ్లమని తల్లి మందలించగా ఇంట్లో గడ్డి మందు తాగాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News January 14, 2026
కామారెడ్డి: పండుగ పూట విషాదం

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు (55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు స్థానిక ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు. కొంపల్లి సాయిలు గ్రామ శివారులోని లింగోష్ పల్లి చెరువు వద్ద చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు మృతుని కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడని ఎస్ఐ చెప్పారు.
News January 14, 2026
ఈ నెల 19 నుంచి సర్పంచులకు ట్రైనింగ్

TG: రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 28 వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రకటించింది. జిల్లాలు, బ్యాచుల వారీగా 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచులో 50 మంది ఉండనున్నారు.


