News November 19, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.
Similar News
News January 17, 2026
పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.
News January 17, 2026
REWIND: 1947-77 నాగోబా జాతర దృశ్యం

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో 1947 నుంచి ఆదివాసీ మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం శ్రీ నాగోబా దేవత పుణ్యక్షేత్రం వెలిసింది. ఆనాటి నుంచి మెస్రం వంశీయులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ తమ సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. ఏటా పుష్య మాసాన్ని పురస్కరించుకొని మహాపూజను నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. ఆదివారం(రేపు) మహాపూజ జరగనుంది.
News January 17, 2026
చిత్తూరు: సచివాలయాలకు నూతన నిబంధనలు

సచివాలయాల వ్యవస్థలో ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులు సమయపాలన కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయాల్లో సేవలు అందించాలని ఆదేశించింది. ఆ మేరకు ఉదయం, సాయంత్రం సిబ్బంది బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలి. సమయపాలన పాటించకపోతే విధులకు హాజరుకానున్నట్లు గుర్తించనున్నారు. లీవ్ పెట్టేందుకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించింది.


