News November 19, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.
Similar News
News January 23, 2026
NGKL: గురుకులాల్లో ప్రవేశాలకు పోస్టర్ ఆవిష్కరణ

జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు డీఎమ్ డబ్ల్యూఓ రాజేశ్వరి ఆధ్వర్యంలో కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌తో పాటు 6, 7, 8 తరగతుల్లోని బ్యాక్‌లాగ్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు tgmreistelangan.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News January 23, 2026
NGKL: జిల్లాలో 795 టన్నుల యూరియా నిల్వలు

నాగర్ కర్నూల్ జిల్లాలో 795 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం పేర్కొన్నారు. మరో 3,369 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మొక్కజొన్న పంట అధికంగా సాగు చేయడం వల్ల యూరియాకు డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రైతులకు 21.802 టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు.
News January 23, 2026
కొడకండ్ల: ముగ్గురికి జీవిత ఖైదు

హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు నమోదైన ఘటన కొడకండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల ప్రకారం.. మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన బూర్గుల ప్రభాకర్‌ను 2017లో హత్య చేసిన భార్య బూర్గుల పూలమ్మ, కుమారులు మురళి, శ్రీకాంత్‌లు కలిసి రోకలిబండతో కొట్టి చంపగా.. నేడు రుజువు అవడంతో జనగామ జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.


